Monday, January 25, 2010

భక్తి పాడర తమ్ముడ..








నమస్కారములు!!!
అందరికి గణతంత్ర దినోస్తవ శుభాకాంక్షలు ఈ సందర్భం లో రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిన ఈ గీతం గుర్తు చేసుకుందామా...
శ్రీలు పొంగిన జీవ గడ్డై.. 
పాలు పారిన భాగ్య సీమై..
శ్రీలు పొంగిన జీవ గడ్డై..
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడ.. 
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడ.. 
పాలు పారిన భాగ్య సీమై..
శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై..
దేశగర్వము కీర్తి చెందగ.. 
దేశచరితము తేజరిల్లగ....
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. 
దేశం మరచిన ధీర పురుషుల..
తెలిసి పాడర తమ్ముడా.. 
శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై..
శ్రీలు పొంగిన జీవ గడ్డై..
పాలు పారిన భాగ్య సీమై..
రాలినది ఈ భరత ఖండము..
భక్తి పాడర తమ్ముడ.. 



అభినందనలు
ప్రసన్న రాయప్రోలు





Wednesday, February 11, 2009

వినుడు వినుడు ....కొన్ని మంచి పర భాష సినిమా పాటలు...

నమస్కారం :)
నాకు ఒక వింత అలవాటు వున్నది...నాకు తెలుగు పాటలే కాకుండా...వేరే భాష పాటలు వినడం చాల ఇష్టం . ఈ పోస్ట్ లో నేను నాకు ఈ మధ్య కాలం లో నచ్చిన నాలుగు పాటల గురుంచి మీకు వివరిస్తాను..

౧.నిన్నిన్దలే నిన్నిన్దలే (మిలన అను కన్నడం సినిమా నుండి ) :

నిన్నిన్దలే నిన్నిన్దలే కనసొందు శురువాగిదే

నిన్నిన్దలే నిన్నిన్దలే మనసిండు కునిదాడిదే

అని సోనునిగం మధురం గ పాడారు . ఈపాట లో ప్రతి పదం ఎంతో అర్ధవంతం గా వుంటుంది :)

ప్రేమ ని చక్కగా వర్ణించారు...

మరి ఎందుకు ఆలస్యం ..మీరు వినండి ఎంచక్కగా...

http://www.youtube.com/watch?v=U65IS5wgyqo

౨. వెళ్ళి పూకల్ ( కన్నతిల్ ముతమిత్తల్ సినిమా నుండి...)

ఈ మధురమైన పాట కన్నతిల్ ముతమిత్తల్ అను తమిళ సినిమా లో నిధీ ...రహ్మాన్.. స్వరపరిచి... గాత్రం చేసారు..ప్రపంచ శాంతి ని కోరుకుంటూ పడే పాట ఇది...

ఆలస్యం ఎందుకు మరో మారు వినండి మరి...

http://www.youtube.com/watch?v=knubvDUdurM&feature=related

౩. వాకిన్ ఇన్ ది మూన్ లైట్ ( సత్యమ శివం సుందరం సినిమా నుండి..)

ఈ మధురంమైన మలయాళం పాట హరిహరన్ పాడారు..

వినండి మరి...

http://www.youtube.com/watch?v=gT7TiSJ8scA&feature=related

౪. కంగల్ ఇరన్దాల్ (సుబ్రహ్మణ్యం పురం సినిమా నుండి..)

సుబ్రమణ్య పురం అను తమిళ సినిమా లో వున్నా ఈ పాట చాల చక్కగా వుంటుంది.. గ్రామీణ వాతావరణం..అక్కడి సంగతులు ఈ పాటలో చాల చక్కగా చిత్రీకరించారు..

ఆలస్యం ఎందుకు వినండి మరీ...

http://www.youtube.com/watch?v=CApQcVAYWHs

ధన్య వాదములు,

ప్రసన్న రాయప్రోలు...

Sunday, October 12, 2008

నాకు నచ్చిన సంగీతం: Bhajagovindam


నమస్కారం :)
నేను ఈ బ్లాగ్ లో వ్రాసి చాల నెలలు అయ్యింది. ఇక నుంచి రెగ్యులర్ గా వ్రాయాలని అనుకుంటున్నాను :)
నాకు నచ్చిన సంగీతం అన్నా శీర్షికన నాకు ప్రియమైన పాటలను ఇక్కడ వివరిద్దామని అనుకుంటున్నాను. ఆది శంకరాచార్యులు వారు రచించిన భజగోవిందం గీతం. ఈ గీతం ఎనిమిదవ శతాబ్దం తో రచించబడినది. ఒక సారి ఆది శంకరాచార్యుల వారు వారణాసి వీధులలో సంచరిస్తూ వుండగా ఒక వృద్ద గురువు తన విద్యార్ధులకు సంస్కృత వ్యాకరణం నేర్పుకుతకు కుస్తీ పడుతున్నాడట... అది చూసి శంకరులు ఈ విధం గ పాడారు ....
"భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతె . సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్ర్^ఇజ్ఞ్కరనే"
ఇలా భజగోవిందం శ్లోకాలను వివరిస్తూ "అద్వైత" సారాంశం అంతా చెప్పారు. భజగోవిందం లో విష్ణు మూర్తి గురించి వుండడం వలన ఈగీతం వైష్ణవులలో కూడా ప్రసిద్ది చెందింది. దీంట్లో ప్రతి శ్లోకం వజ్రం లాంటిది... దానిలో చాల నిగూడ అర్ధం వుంటుంది...
నేను న బాల్యం నుండి.. సుబ్బలక్ష్మి గారి "భజగోవిందం " వింటున్నాను.... మీరు కూడా వినండి మరి.......
http://in.youtube.com/watch?v=r4FUQxn4CnY
అభినందనలు
ప్రసన్న రాయప్రోలు

Sunday, June 8, 2008

పరుగు...ఎక్కడికి..యెందుకు..ఎవరినుంచి..దేనికోసం...

"పరుగులు తీయకే పసిదనా ఫలితము లేదని తెలిసున్ననేడైనా రేపైనా జరిగేదే ఎపుడైనా"

పైన వ్రాసిన వాక్యాలు ఈ మధ్య వచ్చిన "పరుగు" అన్నా చిత్రం లోనిది . మొదట్లో పరుగు పాట రేడియో లో రోజు వస్తు వుంటే చిరాకుగా వుండేది....ఏమిటో ఈ ప్రేమ గోల ...పిచ్చి గొడవ అని అసహ్యం వేసేది....ఒక రోజు ఆఫీసు లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ టాస్క్ eబ్బంది పెడుతుంటే .....కొద్దిగా సమయం విరామం తీసుకుందామని రేడియో విన్నాను..అప్పుడు..ఇదే పాట వస్తున్నది ...చేసేది..ఏమి లేక....జాగ్రత్త గా విన్నాను...అప్పుడు...ఈ పాట మొదటి రొండు వఖ్యాలలో చాల వేదాంతం గోచరించింది.......

ఒక్క నిమిషం నన్ను నేను పర్యవేక్షించుకున్నాను......మనము నిరతరం...ప్రతిక్షణం ..దేని గురించో... పరుగేట్టుతున్నాము. ....మన హడావిడి లో మనము కొనను సార్లూ మన గమ్యం... ఏడో కూడా మరచి పరిగేడుతున్నాము...పరుగు మంచిదే...కాని సరైన......దారిలో .సరైన ...వేగం తో వెళ్ళాలి...ఏవైనా మనకోసం ఆగవు.. మనము..చేసవి... మనము..చీయవలసి వుంటే తప్పకుండ చేస్తాము...మనకు దక్క వలసినవి మనకు రాసి వుంటే తప్పకుండ దక్కుతాయి...మనకి దక్కలేదు అనుకోండి ...అవి మనవి కాదు అన్నా మాట :) .......అనవసరమైన వ్రిధ పరుగు తో మన ప్రస్తుత సమయాన్ని వ్రిధ చేయకుండా...చక్కగా ఉపయోగించుకోవాలి.........:)

అభినందనలు,

ప్రసన్న రాయప్రోలు

Friday, June 6, 2008

నమస్కారం



నమస్కారం :)
"ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు "
రాయప్రోలు వారి బ్లాగ్ కు దయచేయండి
"ఎదేసిమేగిన ఎందుకాలిడినా
ఏ పెతమేక్కిన ఎవ్వరేడురైన
పొగడరా ని తల్లి భూమి భారతిని,
నిలుపరా ని జాతి నిండు గౌరవం"
అని వ్రాసిన రాయప్రోలు సుబ్బా రావు గరి ఇంటి పేరు వారి మయ్యి తెలుగు లో రాయకాపోతే ఎలా అనుకొనే ఈ బ్లాగ్ మొదలు పెట్టాను.
ధన్యవాదములు,
ప్రసన్న రాయప్రోలు