Sunday, October 12, 2008

నాకు నచ్చిన సంగీతం: Bhajagovindam


నమస్కారం :)
నేను ఈ బ్లాగ్ లో వ్రాసి చాల నెలలు అయ్యింది. ఇక నుంచి రెగ్యులర్ గా వ్రాయాలని అనుకుంటున్నాను :)
నాకు నచ్చిన సంగీతం అన్నా శీర్షికన నాకు ప్రియమైన పాటలను ఇక్కడ వివరిద్దామని అనుకుంటున్నాను. ఆది శంకరాచార్యులు వారు రచించిన భజగోవిందం గీతం. ఈ గీతం ఎనిమిదవ శతాబ్దం తో రచించబడినది. ఒక సారి ఆది శంకరాచార్యుల వారు వారణాసి వీధులలో సంచరిస్తూ వుండగా ఒక వృద్ద గురువు తన విద్యార్ధులకు సంస్కృత వ్యాకరణం నేర్పుకుతకు కుస్తీ పడుతున్నాడట... అది చూసి శంకరులు ఈ విధం గ పాడారు ....
"భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతె . సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్ర్^ఇజ్ఞ్కరనే"
ఇలా భజగోవిందం శ్లోకాలను వివరిస్తూ "అద్వైత" సారాంశం అంతా చెప్పారు. భజగోవిందం లో విష్ణు మూర్తి గురించి వుండడం వలన ఈగీతం వైష్ణవులలో కూడా ప్రసిద్ది చెందింది. దీంట్లో ప్రతి శ్లోకం వజ్రం లాంటిది... దానిలో చాల నిగూడ అర్ధం వుంటుంది...
నేను న బాల్యం నుండి.. సుబ్బలక్ష్మి గారి "భజగోవిందం " వింటున్నాను.... మీరు కూడా వినండి మరి.......
http://in.youtube.com/watch?v=r4FUQxn4CnY
అభినందనలు
ప్రసన్న రాయప్రోలు